Friday, November 22, 2024

ప్రతిపక్షాల ఐక్యతా సమావేశానికి మాయావతి దూరం

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోటీచేసేందుకు మహాకూటమి ఏర్పాటుగా ప్రతిపోఆలు ఒక పక్క సన్నాహాలు చేస్తుంగా మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ౯బిఎస్‌పి) మాత్రం ఐక్య ప్రతిపక్షానికి దూరంగా ఉండాలని భావిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మాయావతిని తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటూ సొంత కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

జూన్ 23న బీహార్‌లోని పాట్నాలో నిర్వహించతలపెట్టిన ప్రతిపక్షాల ఐక్య సమావేశానికి బిఎస్‌పి అధినేత్రి మాయావతిని ఆహ్వానించలేదని జనతాదళ్(యునైటెడ్) నాయకుడు కెసి త్యాసి ఇటీవల వెల్లడించారు. ఆయన ప్రకటన వెలువడిన వెంటనే బిఎస్‌పి స్పందిస్తూ 2024 సవాలును ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహ రచన కోసం జూన్ 23న జరగనున్న సమావేశంలో పాల్గొనరాదని తామే నిర్ణయించుకున్నట్లు బిఎస్పి తెలిపింది. ప్రతిపక్ష పార్టీలను ఒక దగ్గర చేర్చేందుకు బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) నాయకుడు నితీష్ కుమార్ తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ తమ ప్రధాని అభ్యర్థి పేరును ప్రతిపక్షాలు బయటపెట్టలేకపోతున్నాయని బిఎస్‌పి నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా&ప్రతిపక్షాల సమావేశానికి తమను ఆహ్వానించనందుకు సంతోషంగా ఉందని బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్తానీ ఆవామ్ మోర్చ(హమ్) వ్యవస్థాపకుడు జితన్ రాం మాంఝి వ్యాఖ్యానించారు. అయితే జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తున్న నితీష్ కుమార్‌కు మాత్రం తాము అండగా ఉంటామని మాంఝి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News