Tuesday, March 4, 2025

పార్టీ నుంచి మేనల్లుని బహిష్కరించిన మాయావతి

- Advertisement -
- Advertisement -

లక్నో : బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) అధ్యక్షురాలు మాయావతి పార్టీ ప్రయోజనాలు, ఉద్యమం దృష్టా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరించానని సోమవారం ప్రకటించారు. ఆకాశ్ ఆనంద్‌ను అన్ని పదవులలో నుంచి తప్పించిన మరునాడే ఆయనపై మాయావతి ఈ చర్య తీసుకోవడం గమనార్హం. ‘పార్టీ ప్రయోజనాలు, ఉద్యమం దృష్టా తన మావగారి వలె ఆకాశ్ ఆనంద్‌ను కూడా పార్టీ నుంచి బహిష్కరించడమైంది’ అని మాయావతి ‘ఎక్స్’లో హిందీ పోస్ట్‌లో తెలియజేశారు. బిఎస్‌పి సంస్థాగత బలాన్ని దెబ్బ తీసిన వర్గాలను సృష్టించడం ద్వారా పార్టీలో అంతర్గతంగా చీలికలు తెస్తున్నారని ఆరోపిస్తూ ఆకాశ్ ఆనంద్ మావగారు అశోక్ సిద్ధార్థ్‌ను మాయావతి ఇంతకు ముందు పార్టీలో నుంచి బహిష్కరించారు.

అశోక్ సిద్ధార్థ్ కుమారుని వివాహం సందర్భంలో నిర్వహించిన కార్యక్రమాలు సహా ఇటీవలి సంఘటనలను పార్టీని కించపరిచేందుకు ఆయన యత్నాలకు ఉదాహరణలుగా ఆమె ఉటంకించారు. ఇది ఆమోదయోగ్యం కాదని, ఈ కారణంగానే ఆయనను బహిష్కరించడమైందని ఆమె తెలిపారు. ఆకాశ్ ఆనంద్‌పై ఆయన మావగారి ప్రభావం రీత్యా ఆయనను పదవుల్లో నుంచి తొలగించడం, బహిష్కరించడం తప్పనిసరి అయిందని మాయావతి వివరించారు. అశోక్ సిద్ధార్థ్ చర్యలు ఇప్పటికే ఆనంద్ రాజకీయ దృక్పథాన్ని పార్టీ అత్యుత్తమ ప్రయోజనాలకు విరుద్ధమైన రీతిలో ప్రభావితం చేయసాగాయని మాయావతి పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News