Wednesday, January 22, 2025

బిఆర్‌ఎస్‌తో పొత్తుకు మాయావతి గ్రీన్‌సిగ్నల్

- Advertisement -
- Advertisement -

సీట్ల పంపిణీపై త్వరలో స్పష్టత
బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్ ప్రకటన

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో బిఎస్‌పి, బిఆర్‌ఎస్ పార్టీల మధ్య పొత్తుకు బిఎస్‌పి జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి అనుమతి లభించిందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆదివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఇరు పార్టీలు కలిసి పోటీచేస్తాయని ప్రకటించారు. బిఎస్‌పి, బిబీఆర్‌ఎస్ పార్టీల కూటమి చర్చలపై రాష్ట్రంలో ఏర్పడిన సందిగ్దానికి బెహన్‌జీ మాయావతి తెరదించారని ఆయన వివరించారు. రాష్ట్రంలోని బిఆర్‌ఎస్ ఎన్‌డిఎ, ఇండియా కూటమిలో లేనందున ఆ పార్టీతో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ హై కమాండ్ అనుమతించిందని తెలిపారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో బిఎస్‌పి, బిఆర్‌ఎస్ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు వివరించారు. బిఎస్‌పి,బిఆర్‌ఎస్ కూటమి కలిసి పోటీ చేసే స్థానాలపై త్వరలోనే సంయుక్త ప్రకటన ఉంటుందని తెలిపారు. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సమక్షంలో జరిగే తదుపరి చర్చలకు పార్టీ రాజ్యసభ ఎంపి, కేంద్ర సమన్వయకర్త రాంజీ గౌతమ్ బెహజ్ జీ దూతగా హాజరుకానున్నారని తెలిపారు. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలు,ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే సంయుక్తంగా మీడియాకు వెల్లడిస్తామన్నారు. బిఎస్‌పి, బిఆర్‌ఎస్ పొత్తులపై మీడియాలో వస్తున్న నిరాధారమైన వార్తలు, వదంతులు,దుష్ప్రచారాలను పార్టీ శ్రేణులు,ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News