Saturday, November 23, 2024

తొక్కిసలాట అభియోగపత్రంలో భోలే బాబా పేరెందుకు లేదు?

- Advertisement -
- Advertisement -

లక్నో: హత్రాస్ లో జులై 2న జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన 3200 పేజీల అభియోగపత్రంలో స్వయంగా స్వామినని ప్రకటించుకున్న ‘భోలే బాబా’ అలియాస్ సూరజ్ పాల్ పేరునెందుకు చేర్చలేదని గురువారం బిఎస్పీ చీఫ్ మాయావతి ప్రశ్నించారు. ఫుల్రాయ్ గ్రామంలో తొక్కిసలాటకు 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు సంబంధించిన అభియోగ పత్రంను మంగళవారం కోర్టుకు సమర్పించారు.

11 మంది నిందితుల్లో సూరజ్ పాల్(భోలేబాబా) పేరును చేర్చకపోవడం వెనుక ప్రభుత్వం అండ ఉందని తెలుస్తున్నట్లు మాయావతి భావించారు. ఎఫ్ఐఆర్ లో సూరజ్ పాల్ పేరును చేర్చలేదన్నారు. ఎఫ్ఐఆర్ లో ఆర్గనైజర్, ఫండ్ రైజర్ అయిన దేవ్ ప్రకాశ్ మధుకర్ పేరును, ఇతర వాలంటీర్ల పేర్లను మాత్రమే చేర్చారన్నారు.

పోలీసులు మధుకర్ సహా 11 మందిని అరెస్టు చేశారు. వారిలో మంజు యాదవ్ అనే వ్యక్తి మాత్రం అలహాబాద్ హైకోర్టు బెయిల్ పై బయటికొచ్చాడని, మిగతా వారంతా కటకటాల వెనుకే ఉన్నారని వారి న్యాయవాది తెలిపారు. భోలే బాబా పేరు అభియోగ పత్రంలో లేకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం అండ ఉందని అర్థమవుతోందని మాయవతి తన ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News