Monday, December 23, 2024

అతిక్, ఆష్రఫ్‌ల హత్య దారుణం: మాయావతి

- Advertisement -
- Advertisement -

లక్నో: అతిక్ అహ్మద్, అతడి సోదరుడు ఆష్రఫ్‌లను పోలీస్ కస్టడీలోనే హత్య చేయడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పని తీరుపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయని బిఎస్‌పి చీఫ్ మాయావతి అన్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అత్యంత తీవ్రమైన ఆందోళనకరమైన సంఘటనను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంటే మంచిదని యూపీ మాజీ సిఎం మాయావతి అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ చట్టవ్యతిరేకంగా ఎన్‌కౌటర్‌ ప్రదేశ్‌గా మారడం ఎంత వరకు సమంజసం ఆలోచించాల్సిన అవసరం ఉందని వరుస ట్వీట్లలో మాయావతి పేర్కొన్నారు. గుజరాత్ జైలు నుంచి తీసుకువచ్చిన అతిక్, బరేలి జైలు నుంచి తీసుకొచ్చి అతడి సోదరుడు అష్రఫ్‌లను కాల్చి చంపడం ఉమేశ్‌పాల్ హత్యలా దారుణం అన్నారు.

ఇది యూపి ప్రభుత్వ లా అండ్ ఆర్డర్ పని తీరుపై ప్రశ్నలను లేవనెత్తుతుందని మాయావతి అన్నారు. సమాజ్‌వాది పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ మరణ భయంతో భద్రతను కోరుతూ సుప్రీంకోర్టులో అతిక్ దాఖలు చేసిన పిటిషన్‌కు ఉపశమనం లభించలేదన్నారు. నకిలీ పోలీస్ కస్టడీలో ఎన్‌కౌంటర్లు, ప్రణాళికబద్ధంగా జరగడం ఖాయమన్నారు. అతిక్ ఇతర కుమారులను కూడా చంపినా ఆశర్యం లేదన్నారు. 2005లో బిజెపి నేత ఉమేశ్‌పాల్‌ను అతిక్ ముఠా సభ్యులు హత్య చేశారు. కాగా అతిక్ అహ్మద్, అష్రఫ్‌ల హత్యకు పాల్పడిన ముగ్గురిని రెయుస్టు చేశామని ప్రయాగ్‌రాజ్ పోలీస్ కమిషనర్ రమిత్ శర్మతెలిపారు. జర్నలిస్టులుగా నటించిన ముగ్గురు వ్యక్తులు హత్యలకు పాల్పడ్డారని తెలిపారు. అతిక్, అష్రఫ్ హత్యల విచారణకు సిఎం ఆదిత్యనాథ్ ముగ్గురు సభ్యుల జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News