లఖ్‌నవూ: దేశంలో ఒకవైపు పేదరికం, నిరుద్యోగం, మౌలిక వసతుల లేమి, విలయతాండవం చేస్తుంటే మరోవైపు బ్యాంకు మోసాలు యధేచ్ఛగా జరుగుతున్నాయని, బహుజన్ సమాజ్ పార్టీ సుప్రీమ్ మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బ్యాంకు మోసాల నుంచి మనదేశం బయటపడుతుందా? అని ప్రశ్నించారు. తాజాగా వెలుగు చూసిన 25 వేల కోట్ల బ్యాంకు మోసం గురించి సోషల్ మీడియా వేదికగా మాయావతి స్పందించారు. దేశంలో చాలాకాలంగా తీవ్ర పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలతో ప్రజలు ఉపాధికి దూరమవుతున్నారని, కొత్తగా ఉపాధి కల్పించే మాట అటుంచితే కుంభకోణాల గురించి వినాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. తాజాగా రూ.23వేల కోట్ల బ్యాంకు కుంభకోణం జరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడంతో ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. బ్యాంకుల్లో డబ్బులు దాచుకోడానికి ప్రజలు భయపడుతున్నారు.ప్రజలకు నమ్మకం కలిగించేలా ప్రభుత్వాలు ఏమీ చేయడం లేదు. కుంభకోణాల నుంచి మనదేశ బ్యాంకులు బయటపడతాయా? అని మాయావతి ట్వీట్ చేశారు.
Mayawati responds on ABG Shipyard fraud