Monday, November 25, 2024

రిజర్వేషన్లపై బీజేపీ, కాంగ్రెస్ శుష్క వాగ్దానాలు: మాయావతి

- Advertisement -
- Advertisement -

ఆగ్రా : రిజర్వేషన్లపై బీజేపీ, కాంగ్రెస్ శుష్క వాగ్దానాలు చేస్తున్నాయని, ఏ పార్టీ కూడా ఈ ప్రయోజనాలు ఉద్దేశించిన వర్గాలకు చేరాలనుకోవడం లేదని బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి శనివారం ఎద్దేవా చేశారు. ఆగ్రాలో ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ తోపాటు సమాజ్‌వాది కూడా ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయడానికి అసమర్ధ ప్రయత్నాలు చేశాయని విమర్శించారు.

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వుడు కేటగిరీల్లో ఖాళీలు భర్తీ కావడం లేదని, ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్ వాది ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల ప్రమోషన్లలో రిజర్వేషన్లు ముగిశాయని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని తమ పార్టీ పార్లమెంట్‌లో లేవనెత్తిందని చెప్పారు. ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం చట్టం సవరించాలని తాము ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామని, అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీతో కుమ్మక్కై అడ్డుకోవడంతో ఈ బిల్లు తీర్మానం కాకుడా మురిగిపోయిందని చెప్పారు. ఆగ్రా బీఎస్‌పి అభ్యర్థులు ఆగ్రా (పూజా అమ్రోహి), ఫతేపూర్ సిక్రీ (రామ్ నివాస్ శర్మ), హథ్రాస్ (హేమ్‌బాబు) లకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. జాతవ్, బ్రాహ్మిన్, ఢంగర్ కులాల నుంచి తమ పార్టీ ప్రాతినిధ్యం కల్పించిందని మయావతి చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న ఆహార ధాన్యాలను ఆసరా చేసుకుని బీజేపీ ఓటర్లను ఓట్లు కోరడాన్ని మాయావతి తీవ్రంగా విమర్శించారు. ఉచిత రేషన్ బీజేపీ నుంచి లేదా నరేంద్రమోడీ జేబు నుంచి రాలేదని, ప్రజలు కడుతున్న పన్నుల నుంచే వస్తోందని గుర్తు పెట్టుకోవాలని ప్రజలను కోరారు. కేంద్రంలో బీఎస్‌పి అధికారం లోకి వచ్చేలా అవకాశం కల్పిస్తే విపక్షాల ప్రభుత్వాలకు భిన్నంగా క్షేత్రస్థాయి నుంచి పనులు జరిగేలా చూస్తామన్నారు. మతం పేరిట సాగుతున్న ముస్లింల అణచివేత ఆగాలన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివేవీ సాగనీయలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News