Friday, January 24, 2025

తెలంగాణలో రాబోయేది బిఎస్పీ సర్కారే.. ఆర్ఎస్పీ సీఎం: మాయావతి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అంబేద్కర్ ను అవమానించిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లాలో బిఎస్పీ నిర్వహించిన భహిరంగ సభకు మాయావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా కోటాలో ఎస్సీ, ఎస్టీ కోటా ఉండాలని.. మొదటి నుంచి బీఎస్పీ ఈ విషయం చెప్తోందన్నారు. ఇక, తెలంగాణలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని విమర్శించారు.

ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టవని.. భ్రష్టాచార్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణలో రాబోయేది బిఎస్పీ సర్కారేనన్నారు. సబ్బండవర్గాలకు అండగా ఉండేది బీఎస్పీ పార్టీనే అని.. ఈ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఎస్పీ గెలిస్తే.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారని మాయావతి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News