లక్నో: దేశంలోని ఒబిసిల జనగణన సంబంధిత నిర్మాణాత్మక చర్యలు చేపడితే మోడీ ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఇస్తామని బిఎస్పి అధినేత్రి మాయావతి ప్రకటించారు. కులాల వారి జనసంఖ్య అంశం ఇప్పుడు దేశంలో ప్రధాన చర్చనీయాంశం అయింది. ఇతర వెనుకబడిన వర్గాలు (ఒబిసి)ల సంఖ్య ఎంత అనేది తేలాల్సి ఉంది. ఒబిసి జనసంఖ్య విషయంలో కేంద్రం స్పందిస్తే అది కీలకమైన విషయమే అవుతుంది. ఈ దిశలో ఎటువంటి చర్యకు దిగినా బిఎస్పి కేంద్రానికి ఇచ్చే మద్దతు బేషరతుగా ఉంటుంది. పార్లమెంట్ , పార్లమెంట్ వెలుపల కూడా తమ నుంచి సహకారం అందుతుందని మాయావతి శుక్రవారం హిందీలో వెలువరించిన ట్వీటులో పేర్కొన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గురువారం దేశ రాజధాని ఢిల్లీకి వచ్చారు. కులాల వారి సెన్సస్ చిక్కుముడి గురించి ప్రధాని మోడీతో చర్చించేందుకు ఆయన వచ్చారు. ప్రధాని అపాయింట్మెంట్ కోరారు. కేంద్రం కులాల వారి సెన్సస్ను షెడ్యూల్ కులాలు (ఎస్సి), షెడ్యూల్ తెగలు (ఎస్టి)కు పరిమితి చేయాలని ప్రతిపాదించింది. దేశవ్యాప్తంగా కులాలవారిగా ఒబిసిల సంఖ్యను నిర్థారించాలని బిఎస్పి కోరుతూ వస్తోంది.
ఒబిసి లెక్కింపు షరతు మోడీకి మాయావతి మద్దతు
- Advertisement -
- Advertisement -
- Advertisement -