Wednesday, January 22, 2025

చేతులు కలిపేదే.. మనసులు కలిపేది కాదు: మాయావతి

- Advertisement -
- Advertisement -

పాట్నా : పాట్నా ప్రతిపక్ష సమావేశం కేవలం చేతులు కలిపేదే తప్ప మనసులు కలిపేది కాదని, అందువల్ల తాము ఈ సమావేశానికి హాజరు కాబోమని బిఎస్‌పి అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ‘ఈ దేశాన్ని ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, వెనుకబాటుతనం, నిరక్షరాస్యత, జాతి విద్వేషాలు పట్టి పీడిస్తున్నాయని,ప్రస్తుతం అణగారిన వర్గాల వారి పరిస్థితిని బట్టి, కాంగ్రెస్, బిజెపివంటి పార్టీలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని అమలు చేయలేవని స్పష్టం అవుతోంది. ఇలాంటి సమావేశాలు నిర్వహించడానికి ముందే ఆయా పార్టీలుప్రజలకు తమపై ఉన్న విశ్వాసాన్ని నిరూపించుకుంటే బాగుండేది’ అని మాయావతి ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో 80 లోక్‌సభ స్థానాలున్న యుపి కీలకమైనదని, విపక్షాలను ఐక్యం చేసే విషయంలో ఆ రాష్ట్రానికి చెందిన విపక్ష నేతలను విస్మరించడం విడ్డూరమని కూడా ఆమె దుయ్యబట్టారు. అయితే ఈ సమావేశానికి బిఎస్‌పినిఆహానించలేదని బీహార్ నేతలు చెబుతున్నారు. మరో వైపు కుటుంబ కార్యక్రమం కారణంగా తాను శుక్రవారం పాట్నాలో జరిగే సమావేశానికి వెళ్లడం లేదని రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు జయంత్ చైదరి చెప్పారు. అయితే ప్రతిపక్షాల ఐక్యతలో ఈ సమావేశం ఓ మైలురాయి అవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News