Monday, December 23, 2024

తప్పుడు వాగ్దానాల బీజేపీని గద్దె దించండి : మాయావతి

- Advertisement -
- Advertisement -

Mayawati urges people to do not vote ruling party

 

లక్నో : ఉద్యోగాలిస్తామంటూ తప్పుడు వాగ్దానాలు చేసిన బీజేపీని గద్దె దించాలని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి పిలుపునిచ్చారు. యూపీలో మూడో దశ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో మాయావతి ట్వీట్లలో బీజేపీ వాగ్దానాలను ఎండగట్టారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నమ్మించిన బీజేపీ ఆ పనిచేయడానికి బదులు ఉన్న ఉద్యోగాలను కూడా ఊడకొట్టిందని ఆరోపించారు. ప్రజల జీవనానికి అవసరమైన ఉపాధి కల్పించాల్సిన తక్షణ ఆవశ్యకత ప్రస్తుత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. అధికార పార్టీ తప్పుడు విధానాల వల్ల పేద ప్రజలు మరింత పేద ప్రజలుగా మారారని, ఇంకెంతమాత్రం ఆ పార్టీని నమ్మాల్సిన పనిలేదని , బీఎస్‌పీ విశ్వసనీయమైన పార్టీ అని మరోట్వీట్‌లో ఆమె పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News