Monday, December 23, 2024

యుపి ఎన్నికల్లో మాయావతి పోటీ చేయరు: బిఎస్‌పి

- Advertisement -
- Advertisement -

Mayawati will not contest UP polls: BSP

లక్నో: బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్‌సి మిశ్రా తెలిపారు. తాను కూడా పోటీ చేయడంలేదని మిశ్రా తెలిపారు. మిశ్రా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు. కాగా, మాయావతి ఏ సభలోనూ సభ్యురాలిగా లేరు. యుపితోపాటు పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నందున పార్టీ అభ్యర్థుల గెలుపునకు మాయావతి ప్రచారం నిర్వహిస్తారని ఆయన తెలిపారు. 403 స్థానాలున్న యుపిలో ఫిబ్రవరి 10నుంచి ఏడు విడతల్లో పోలింగ్ జరగనున్నది. అన్ని స్థానాలకూ బిఎస్‌పి పోటీ చేయనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News