Monday, December 23, 2024

రాహుల్ గాంధీకి కౌంటరిచ్చిన మాయావతి

- Advertisement -
- Advertisement -

 

Mayawati

లక్నో: కూటమి ఏర్పాటుకు మాయావతి అంగీకరించలేదని ఇటీవల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యపై దళిత నాయకురాలు, బిఎస్‌పి నేత మాయావతి కౌంటరిచ్చింది. ‘సొంతిల్లును చక్కదిద్దుకోలేని వ్యక్తి బిఎస్‌పి లొసుగులు చూయించాలనుకున్నాడు’ అంది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాలని చెబుతూ, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై దృష్టి పెట్టాలంది. ‘అలాంటి వ్యాఖ్యలు చేయడానికి ముందు కాంగ్రెస్ వంద సార్లు ఆలోచించుకోవాలంది. వారు బిజెపి మీద విజయం సాధించలేకపోయారు. కానీ నిందలు వేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయాక కూడా కాంగ్రెస్ ఏమీ చేయలేదు’ అని ఆమె విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ శనివారం ‘మాయావతికి యూపి ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని కూడా చెప్పాము. కానీ ఆమె మాతో మాట్లాడనైనా మాట్లాడలేదు’ అన్నారు. యూపిలో బిజెపికి స్పష్టమైన మార్గాన్ని మాయావతి చూయించిందని రాహుల్ అన్నారు. ఇదిలావుండగా ‘రాహుల్ తండ్రి, రాజీవ్ గాంధీ సైతం బహుజన్ సమాజ్ పార్టీని అప్రతిష్ఠపాలు చేయాలనుకున్నారు’ అని మాయావతి పేర్కొన్నారు. ‘ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా అదే పనిచేస్తున్నారు. నేను ఇడి, ఇతర దర్యాప్తు సంస్థలకు భయపడిపోతున్నానంటున్నారు. అవన్నీ నిజం కావు. మేము అన్ని అంశాల్లో సుప్రీంకోర్టులో గెలచాము’ అని మాయావతి చెప్పుకొచ్చారు. ‘ఉత్తర్‌ప్రదేశ్‌లో బిజెపి గెలిచినప్పటికీ అది వాస్తవానికి రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ను తుడిచిపెట్టింది. 403 సీట్లలో కేవలం రెండు మాత్రమే ఆ పార్టీ గెలిచింది. అంతేకాక ఆ పార్టీ 2.5 శాతం కన్నా తక్కువ ఓట్లను పొందింది. 97 శాతం కాంగ్రెస్ అభ్యర్థులు తమ సెక్యూరిటీ డిపాజిట్‌ను కూడా కోల్పోయారు’ అన్నారు. బిఎస్‌పి కేవలం ఒక్క సీటే గెలిచింది.కానీ దాని వాటా దాదాపు 13శాతంగా ఉంది. దాదాపు 72 శాతం బిఎస్‌పి అభ్యర్థులు తమ డిపాజిట్ కూడా కోల్పోయారు. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు ప్రధానంగా బిజెపి, సమాజ్‌వాదీ పార్టీల మధ్య జరిగిన బైపోలార్ కంటెస్ట్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News