ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద ఘటనకు ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ఒక మేడే కాల్ వచ్చిందని శనివారం భారత సైన్యం వెల్లడించింది. అలాగే ఆ హెలికాప్టర్‌లో ఉన్నవారంతా మృతి చెందారని, చివరి మృతదేహాన్ని కూడా గుర్తించినట్టు చెప్పింది. “ ప్రమాదానికి ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎటిసి) కి మేడే కాల్ వచ్చింది. సాంకేతిక లోపాన్ని సూచించింది. అది అత్యవసర ప్రమాదకర పరిస్థితికి నిదర్శనం. కానీ ప్రమాద సమయంలో వాతావరణం అనుకూలంగా ఉంది. పైలట్లు అందరూ అనుభవం కలవారు. అయితే కొండలు, దట్టమైన అడవులు కలిగిన ఆ ప్రాంతం అత్యంత సవాలుతో కూడుకున్నది. ఇక ఆ హెలికాప్టర్ 2015 నుంచి విధుల్లో ఉంది. ఘటనకు గల కారణాలను గుర్తించేందుకు విచారణకు ఆదేశించాం ” అని ఆర్మీ ప్రకటనలో వెల్లడించింది. శుక్రవారం కూలిన ఆర్మీ హెలికాప్టర్‌లో ఉన్నవారంతా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఐదో మృతదేహాన్ని సిబ్బంది గుర్తించారు. ఈ ప్రమాదంలో కూలిపోయినది స్వదేశీ తయారీ సాయుధ హెలికాప్టర్ (హెచ్‌ఎఎల్ రుద్ర)
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు మేడే కాల్ !
- Advertisement -
- Advertisement -
- Advertisement -