Monday, January 20, 2025

దేవరకరుణాకర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మేయర్, కమిషనర్

- Advertisement -
- Advertisement -

 

 

హైదరాబాద్: జిహెచ్ ఎంసిలోని వార్డు నంబర్ 71 గుడి మల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ వృతి పట్ల మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, జి హెచ్ ఎం సి కమిషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. దేవర కరుణాకర్ మరణ సమాచారం అందిన వెంటనే మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి హుటాహుటిన సిటీ న్యూరో హాస్పిటల్ కు వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన గుడి మల్కా పూర్ కార్పొరేటర్ గా రెండు పర్యాయాలు పనిచేసినట్లు మేయర్ తెలిపారు. కార్వాన్, నాంపల్లి కార్పొరేటర్ ఎన్నికల లో పోటీ చేశారన్నారు. సీనియర్ కార్పొరేటర్ చనిపోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు.

 

కార్పొరేటర్ గా నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడే వారనీ, అన్ని పార్టీల కార్పొరేటర్ల తో చాలా మంచిగా, సఖ్యతగా సౌమ్యుడు గా ఉండే వారనీ గుర్తు చేసుకున్నారు. జిహెచ్ఎంసిలో కౌన్సిల్ సమావేశం లోను సభ సజావుగా జరిగేందుకు సహకరించేవారనీ మేయర్ గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుణ్ణి ప్రార్థిస్తు వారి కుటుంబ సభ్యులకు మేయర్ సానుభూతిని వ్యక్తం చేశారు. గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 71 వార్డు గుడి మల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ బ్రెయిన్ స్ట్రోక్ తో మరణం పట్ల లోకేష్ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కార్పొరేటర్ గా రెండు పర్యాయాలు పని చేశారని ఏంతో సామ్యుడుగా పేరుగాంచినట్లు మృతి బాధాకరమని ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కమిషనర్ ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు కమిషనర్ సానుభూతి వ్యక్తం చేశారు.

Mayor Commissioner condolence Devarakarunakar dead

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News