Saturday, November 23, 2024

హెల్త్ క్యాంపును ప్రారంభించిన మేయర్, కమిషనర్

- Advertisement -
- Advertisement -

హన్మకొండ : మహా నగరపాలక సంస్థ, వరంగల్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ సహకారం తో మహిళ ఆరోగ్యం,ఇంటికి సౌభాగ్యం పేరు తో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమం లో భాగంగా మహిళా పారిశుధ్య సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఇండోర్ స్టేడియం లో మంగళవారం నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ముఖ్య అతిథి గా హాజరై కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ సిబ్బందికి అందిస్తున్న వైద్య సేవలను గురించి డాక్టర్‌లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ హెల్త్ క్యాంప్ లో సుమారు 174 మంది సిబ్బందికి బి.పి,సుగర్, తో పాటు వివిధ రక్త పరీక్షలు నిర్వహించడం జరిగిందని, 59 మంది రక్త నమూనాలను తదుపరి పరీక్షల నిమిత్తం తెలంగాణ డయాగ్నొస్టిక్ కు పంపడం జరుగుతుందని, 74 మందికి గర్భాశయ ముఖద్వార పరీక్షలు,ఓరల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని ఇందులో 5 కేసులు గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు,,4 కేసులు బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని ఈ నమూనాలు తదుపరి నిర్దారణకు పంపించడం జరుగుతుందని తెలిపిన మేయర్ పారిశుధ్య సిబ్బందికి వ్యాధుల పట్ల అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఆది లోనే గుర్తించి చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడవచ్చునని మేయర్ అన్నారు. మేయర్,కమిషనర్ లు సిబ్బందికి అందిస్తున్న మందులను (టాబ్లెట్స్) పరిశీలించారు. ఇట్టి కార్యక్రమం లో ఉప మేయర్ రిజ్వానా శమీం మసూద్, ఇంఛార్జి అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్,సి.ఎం.హెచ్. ఓ.డా.రాజేష్, పి.ఓ.ఎన్.సి.డి.డా. ఉమా రాణి,డి.ఎస్. ఓ.డా. వాణి శ్రీ, డాక్టర్లు అనూహ్య,వర్ష,వైద్య సిబ్బంది తో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News