మన తెలంగాణ/సిటీ బ్యూరో: దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు అనేక పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్‌లోని మేయర్ తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలసి లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఇప్పటికే సుమారు 6లక్షల పై చిలుకు రేషన్ కార్డులుండగా కొత్తగా మరో 56 వేల కార్డులను మంజూరు చేయడం జరిగిందన్నారు. దీంతో మరో 2లక్షలమందికి ఉచితంగా బియ్యం అందనున్నాయని మేయర్ వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్డులను మంజూరు చేయడం జరుగుతుందని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారన్నారు. షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్స్‌లాంటి పథకాలు మరెక్కడా లేవన్నారు. రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా 383 మంది లబ్దిదారులకు కొత్త కార్డులను ఇచ్చారు.
కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసినా మేయర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -