Wednesday, January 22, 2025

ఇస్రో శాస్త్రవేత్తలకు మేయర్ విజయలక్ష్మి శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చంద్రుని దక్షణ ధృవం పై చంద్రయాన్-3 విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేయడంతో పాటు విజయాన్ని సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 నిలవడంంతో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం ఖ్యాతి గడించిందన్నారు. చంద్రుని దక్షణ ధృవం పైకి చేరుకోవాలి అని అనేక దేశాలు ప్రయత్నించిన సఫలీకృతం కాలేదని, ఈ ఘనత సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలు కృషి పట్ల యావత్తు దేశ ప్రజలు గర్వ పడుతున్నట్లు మేయర్ తెలిపారు. ఇలాంటి ప్రయోగాలు మరిన్ని విజయవంతం కావాలని కోరుకుంటూ చంద్రయాన్-3 కోసం అహర్నిశలు కృషి చేసిన శాస్త్రవేత్తలకు ప్రతి ఒక్కరికీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News