మన తెలంగాణ హైదరాబాద్ : మేయర్ గద్వాల విజయలక్ష్మి ఓ పేద కుటుంబానికి ఆపన్న హస్తం అందించింది. నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అక్కకు వైద్యం కోసం రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చి చేతిలో సరిపోను డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న ఓ తమ్ముడు పడుతున్న బాధలను తెలుసుకున్న మేయర్ చల్లించిపోయియారు. హూటా హూటిన అక్కడి స్వయంగా వెళ్లి ఆ నిరుపేద కుటుంబాన్ని అదుకున్నారు. మహారాష్ట్రకు చెందిన పాండు రంగ కరాడే అనే వ్యక్తి తన అక్క ఇందూబాయి నోటి క్యాన్సర్‌తో బాధపడుతుండడంతో చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌లోని బసవతారకం ఆసుపత్రికి తీసుకు వచ్చాడు.
చికిత్స కోసం ప్రతి 5 రోజులకోసారి రావాల్సి ఉంటుందని వైద్యులు తెలపడంతో కూలి పనులు చేసుకునే ఈ నిరుపేద కుటుంబానికి నాందేడ్ నుంచి రావడం ఆర్ధికంగా భారంగా మారడం, కనీసం బస్సు చార్జీలకు కూడా డబ్బులులేకపోవడంతో ఆసుపత్రి సమీపంలోనే ఓ చెట్టు కింద ఆశ్రయం పొందతున్నారు. నోటి క్యాన్సర్ కావడంతో ఇందూబాయికి కేవలం ద్రవాహారాన్ని మాత్రమే పైపు ద్వారా అందిస్తున్నారు. దీంతో మీడియా ద్వారా విషయం తెలుసుకున్న మేయర్ విజయలక్ష్మి అప్పటికప్పడు కొంత డబ్బును సమాకూర్చి పాండు రంగ కరాడేకు అందజేయడంతోపాటు ఆసుపత్రి డైరెక్టర్ టిఎస్‌రావుతో మాట్లాడి వారికి ఉచిత వైద్య చికిత్సతో పాటు వారు ఉండేందుకు ఉచిత గదిని కేటాయించాలని కోరారు. దీంతో స్పందించిన ఆసుపత్రి వారు వెంటనే ఇందుబాయికి ఉచితంగా గదిని కేటాయించారు. మేయర్ బసవతారకం ఆసుప్రతిను సందర్శించి వారి సేవలను అభినందించారు.