హైదరాబాద్: జిహెచ్‌ఎంసి కార్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగామేయర్ గద్వాల విజయలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, కమిషనర్ లోకేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ అభివృద్దికి కలిసికట్టు పనిచేద్దామని ఇందుకు అందరూ కలిసి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తితో పోరాడి సాధించుకున్న తెలంగాణ ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేతృత్వంలో అభివృద్ధి దిశలో పయనిస్తోందన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఆ తర్వాత హైదరాబాద్ నగర అభివృద్ధిని పోల్చి చూడాలన్నారు. దార్శనిక ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకత్వంలో యువ నాయకుడు పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ నాయకత్వంలో హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు.
ఇందుకు నిదర్శనం నగర అభివృద్దే అని తెలిపారు. యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మరి కట్టడికి జిహెచ్‌ఎంసి కార్మికులు సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుండి సేవలను అందించారని ఈ సందర్భంగా మేయర్ అభినందించారు. అన్ని రంగాలతో పాటు నగర ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం చూపినప్పటికీ పౌర సేవలను అందించడరంతో జిహెచ్‌ఎంసి ఎప్పుడూ ముందు వరసలోనే ఉందంటూ మేయర్ గుర్తు చేశారు. కరోనా నియంత్రణ మొదల్కొని వ్యాక్సినేషన్ వరకు బల్దియాదే ప్రథమ స్థానమన్నారు. నగరంలోని నిరుపేదలకు నాణ్యమైన వైద్యసేవలను అందించడమే లక్షంగా గ్రేటర్‌లో 300 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశామని తెలిపారు. జనాభాలో సగభాగంగా ఉన్న మహిళల అభివృద్దితోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమన్న ప్రభుత్వం ఆకాంక్షకనుగుణంగా జిహెచ్‌ఎంసి పాలక మండలిలో 50 శాతం మంది కార్పొరేటర్లు మహిళలే ఉన్నారని తెలిపారు. మహిళా సాధికారితలో భాగంగా దాదాపుగా 47,7456 మహిళౠ స్వయం సహాయక సంఘాల్లో 5 లక్షలకు పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారని వెల్లడించారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి ఇప్పటీ వరకు 63,2393 మహిలా సంఘౠలకు రూ.2,177 కోట్ల రుణాలను అందించామని పేర్కొన్నారు. నగరంలో ఏదైన విపత్తులు , దురదృష్ట కర సంఘటనలు ఎదురైతే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సుషిక్తులైన సిబ్బందితో కూడిన డిఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయన్నారు. గ్లోబల్ సిటీగా రూపుదిద్దుకుంటున్న మన హైదరాబాద్‌నగరంలో 3వేల కేంద్రాల్లో వైపై సదుపాయాన్ని కల్పించినట్లు మేయర్ వెల్లడించారు. ట్యోకో ఒలంపిక్ క్రీడల్లో పథకాలను సాధించిన క్రీడాకారులకు మేయర్ అభినందనలు తెలిపారు. ఈ పతాకావిష్కరణ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ప్రియాంకా ఆలా, జయరాజ్ కెనడి, శంకరయ్య, యాదగిరి రావు, కృష్ణ, విజయలక్ష్మి, సిపిఆర్‌ఓ కె. వెంకటరమణ, చీఫ్ ఇంజనీర్లు దేవానంద్, సరోజా రాణి, జోనల్ కమిషనర్ ప్రావిణ్య తదితరులు పాల్గొన్నారు.