హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సి జాగ్రత్తలపై మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి
జోనల్ కమిషనర్ లతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో అస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మేయర్ అధికారులన ఆదేశించారు. పోలీస్, జిహెచ్ఏంసి శాఖల సమన్వయంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రేపటి వరకు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిందని. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ప్రజలు అత్యవసరం పని ఉంటేనే బయటి రావాలని తెలిపారు. హిమాయత్, ఉస్మాన్ సాగర్ జంట జలయాలు గేట్లు ఎత్తి వేసిన నేపథ్యంలో మూసి నది లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జోనల్ కమిషనర్ లను ఆదేశించారు. హెల్ప్ లైన్ కు వచ్చిన పిర్యాదులకు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులకు మేయర్ సూచించారు.