హైదరాబాద్: నగరవాసులందరీకీ మేయర్ గద్వాల విజయలక్ష్మి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలంతా మరింత ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. గ్లోబల్ సిటీగాహైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, మంత్రి కె.తారక రామారావు ఆలోచనలకు అనుగుణంగా 2020లో అనేక కార్యక్రమాలను చేపట్టామన్నారు. రానున్న కోత్త సంవత్సరంలో కూడా గ్రేటర్ హైదరాబాద్‌ను మరింత నివాసయోగమైన నగరంగా మార్చాలన్న అలోచనతో ముందుకు వెళ్లనున్నట్లు మేయర్ తెలిపారు. ఇప్పటికే ప్రపంచంలోని అనేక నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఎంతో ఆహ్లాదకరమైన నగరంగా గుర్తింపు పొందిన విషయం విదతమే అన్నారు. ఈ ఏడాది స్వచ్చ సర్వేక్షన్‌లో మన నగరం ర్యాంక్‌ను మరింత మెరుగుపర్చడంతో పాటు గార్బేజ్ ఫ్రీ సిటీ గా చేయాలన్న లక్షంతో పని చేయనున్నట్లు మేయర్ వెల్లడించారు.
2021లో భారీ వర్షాలతో నగరంలోని కొన్ని ప్రాంతాలు భాగా దెబ్బతిన్నాయని, అలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఎన్‌ఎస్‌డిపి కార్యక్రమం ద్వారా నాలాలను మెరుగుపర్చుతున్నామని తెలిపారు. వరద సమస్యను శాశ్వతగా పరిష్కరించేందుకు చేపట్టిన పనులను కొత్త సంవత్సరం పూర్తి చేస్తామని వెల్లడించారు. నగరవాసులు ఎదుర్కోంటున్న మరో ప్రధానమైన ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు నగరంలోని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లను విస్తరించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో ప్లైఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జిలను నిర్మిస్తున్నామన్నారు. ఎస్‌ఆర్‌డిపి కింద మరిన్ని ప్రాంతాల్లో రోడ్లు, జంక్షన్లను అభివృద్ది చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో జీవించడమంటే ఆనందంగా జీవించడం అనేలా నగరాన్ని తీర్చిదిద్దడమే లక్షంగా పని చేస్తున్నామని తెలిపిన మేయర్ విజయలక్ష్మిమరోసారి నగరవాసులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.