Wednesday, January 22, 2025

పాదచారుల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -
- Advertisement -

Mayor inaugurated Katedan Foot Over Bridge

హైదరాబాద్ : పాదచారుల భద్రత చర్యల్లో భాగంగా జిహెచ్‌ఎంసి వ్యాప్తంగా రద్దీ మార్గాల్లోని ప్రధాన చౌరస్తాల వద్ద రూ. 83.16 కోట్ల వ్యయంతో 36 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. సోమవారం చార్మినార్ జోన్ లోని రాజేంద్రనగర్ సర్కిల్ స్వప్న థియేటర్ కాటేదాన్ వద్ద రూ. 3.5కోట్ల వ్యయంతో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి ని రాజేంద్ర నగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి అందుబాలోకి రావడంతో కాటేదాన్ పరిసర ప్రాంత ప్రజలకు,సుమారు 5 వేల మంది ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. పాదచారులకు ప్రమాదాలు సంభవించకుండా దోహదపడుతుందని తెలిపారు. కాటేదాన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి 21 మీటర్ల పొడవు తో ప్రజల సౌకర్యార్థం అధునాతనంగా నిర్మించారు లిఫ్ట్ సౌకర్యం కల్పించడం తో పాటు రెండు సిసి కెమెరాలను అమర్చడం జరిగిందని తెలిపారు.

నగర వ్యాప్తంగా 32 పుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టగా ఇప్పటీ వరకు 7ఫుట్ ఓవర్ బ్రిడ్జి లు అందుబాటులోకి వచ్చాయని, మరో 22 వివిధ దశలో ఉన్నాయన్నారు. అంతేకాకుండా రూ.33 కోట్ల అంచనా వ్యయంతో 12 జంక్షన్లను వినూత్నంగా అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో భాగంగా అవసరమైన చోట పాదచారుల కోసం సిట్టింగ్ సౌకర్యం, సుందరీకరణ పనులు చేపడుతున్నమని మేయర్ తెలిపారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూరైందని, పనులను త్వరగా చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రయోగత్మాకంగా చేపడుతున్న ఈ జంక్షన్ల అభివృద్ధి సత్ఫాలితాలిస్తే మిగతా జంక్షన్లను అభివృద్ధి చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైలార్ దేవులపల్లి కార్పొరేటర్ తోకలశ్రీనివాస్ రెడ్డి, చార్మినార్ జోన్ ఎస్.సి నర్సింగ్ రావు, ఇ ఇ నరేందర్ గౌడ్, డిప్యూటీ కమిషనర్ రాజు నాయక్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అప్పా చెరువు అభివృద్ది పనులు పరిశీలించిన మేయర్ ః
పాదచారుల భద్రత చర్యల్లో భాగంగా జిహెచ్‌ఎంసి వ్యాప్తంగా రద్దీ మార్గాల్లోని ప్రధాన చౌరస్తాల వద్ద రూ. 83.16 కోట్ల వ్యయంతో 36 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.

రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని అప్పా చెరువు అభివృద్ది పనులను మేయర్ గద్వాల విజయలక్ష్మి సోమవారం పరిశీలించారు. అప్పా చెరువు నుంచి జాతీయ రహదారి 44 వరకు రూ. 7 కోట్ల వ్యయంతో నిర్మిసస్తు బాక్స్ డ్రెయిన్ పనులను ఈ సందర్భంగా మేయర్ పరిశీలించారు. డ్రెయిన్ పనులు 70 శాతం పూరైనందున్న మిగతా పనులు ఈ నెల చివరినాటికి పూర్తి చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News