హైదరాబాద్: వరద ముంపు నివారణకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలా పనులను నిర్దేశించిన గడువులోపు పూర్తిచేయాలని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి సంబంధింత అధికారులను ఆదేశించారు. గురువారం ఎల్‌బినగర్ నియోజకవర్గంలో ఎస్‌ఎన్‌డిపి కింద రూ.103 కోట్ల వ్యయంతో చేపట్టిన 9 నాలాల అభివృద్ది పనులను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎస్‌ఎన్‌డిపి ద్వారా చేపడుతున్న నాలాల పనుల పురోగతిపై అధికారులతో సమిక్షించారు. మేయర్ మాట్లాడుతూ నగరంలో కొనసాగుతున్న నాలాల అభివృద్ది పనులన్ని వర్షకాలానికి ముందే పూర్తి అయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఎల్‌బినగర్ ఎమ్మెల్యే కోరిక మేరకు రెండు పనుల్లో మార్పులు చేసి వాటిని వెంటనే మొదలు పెట్టాలని అధికారులను అదేశించారు. ఈ పనులకు సంబంధించి వాటర్ వర్క్, ట్రాన్స్‌కో, ఇతర యుటిలిటీలు ఉన్న నేపథ్యంలో అలైన్‌మెంట్ మార్సు చేసి పనుల చేపట్టాలన్నారు.
సరూర్‌నగర్ చెరువు నుంచి జోనల్ ఆఫీస్ మీదగా చైతన్యపురి వరకు, సరూర్ నగర్ చెరువు నుంచి కోదండరామ్ నగర్ మీదగా చైతన్యపురి వరకు చేపట్టనున్న నాలాల పనులను ముందుగా అలైన్‌మెంట్ చేయగా వాటర్ వర్క్ యుటిలిటీని తొలగించే అవకాశం లేని కారణంగా ఈ స్థానిక ఎమ్మెల్యే సూచన మేరకు ఈ అలైన్మెంట్ మార్చాలని మేయర్ అధికారులను అదేశించారు. సరూర్ నగర్ నుంచి జోనల్ కార్యాలయం మీదగా చైతన్యపురి వరకు చేపట్టాల్సిన పనునలు సాయిబాబా ఆలయం నుంచి చేపట్టనున్నుట్ల వెల్లడించారు. అదేవిధంగా సరూర్ నగర్ నుంచి కోదండరాం నగర్ మీదగా చైతన్యపురి వరుకు చేపట్టే పనిని తిరుమలనగర్, రాకూర్ హరిప్రసాద్ ప్రేమిసెస్ మీదగా చైతన్యపురి వరకు చేపట్టే విధంగా మార్పులు చేసినట్లు మేయర్ వివరించారు. ఈ సమావేశంలో ఇఎన్‌సి జియాఉద్దీన్, సిఈ కిషన్, ఎస్‌సి భాస్కర్‌రెడ్డి, ఈఈ కృష్ణయ్య, డిప్యూటీ ఈఈ వెంకట్ కిరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.