Wednesday, January 22, 2025

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: మేయర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గ్రేటర్ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్ లో రూ. 1.21 కోట్ల వ్యయంతో చేపట్టినున్న వివిధ అభివృద్ధి పనులకు నగర మేయర్ మంగళవారం శంకుస్థాపన చేయడంతో పాటు పూరైన పనులను ప్రారంభించారు. . ఈ సందర్భంగా ప్రేమ్ నగర్ కారంపూడి బస్తీ బల్కాపూర్ నాలా వరకు రూ. 77 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆర్.సి.సి బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు.

అదేవిధంగా బంజారాహిల్స్ ఉదయ్ నగర్ మెయిన్ రోడ్ సత్య కిరణం జనరల్ స్టోర్ వరకు రూ. 12 లక్షల వ్యయంతో నిర్మించనున్న విడి సిసి రోడ్ల నిర్మాణం, . ఉదయ్ నగర్ లో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న వి.డి.సి సి నిర్మాణ పనులకుశంకుస్థాపన చేశారు. అంతేకాకుండా రూ. 32 లక్షల వ్యయంతో బంజారాహిల్స్ డివిజన్ లో నిర్మించిన దోబీఘాట్, బోరు, గది నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ దోబీ ఘాట్ నిర్మాణ వల్ల 1500 మంది ప్రత్యేక్షంగా ఉపాధి పొందునున్నారని తెలిపారు. .ఈ కార్యక్రమంలో ఇ.ఇ విజయ్ కుమార్, డి.సి రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News