Monday, December 23, 2024

మహిళా బిల్లుపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హర్షం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టడం పట్ల నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాలకు పైగా పెండింగ్ లో ఉన్న బిల్లు ప్రవేశపెట్టడం తో సంతోషంగా ఉందని మేయర్ అన్నారు. ఈ బిల్లుతో మహిళలు కూడా రాజకీయ రంగంలో ముందు ఉంటారని, దేశ అభివృద్ధిలోతమ వంతుపాత్రనుపోషిస్తారని, మహిళా సాధికారిక సాధ్యమవుతుందని అన్నారు.

మహిళా బిల్లు ఆమోదం పొందటం దేశానికే గర్వకారణం అని తెలిపారు. ఈ బిల్లుకు నారి శక్తి అని నామకరణం చేయటం సంతోషమని మహిళలందరూ తరఫున కృతజ్ఞతలు తెలియ జేస్తున్నమన్నారు..మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టడంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృషి ఎంతో ఉందన్నారు. మహిళల అందరి తరపున ఎమ్మెల్సీ కవితకు మేయర్ ధన్యవాదాలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News