హైదరాబాద్: నగర ప్రజలు కరోనా టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లు లేవని, ఎవరు భయపడాల్సిన పనిలేదని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొనారు. మంగళవారం ఆమె పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా 1005 ప్రభుత్వ కేంద్రాలు, 231 ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నగరంలో 45నుంచి 60 ఏళ్ల వయస్సు గల వారితో పాటు బిపి, షుగర్ వ్యాధులున్న వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. అందరూ టీకా తీసుకుని ముఖానికి మాస్కులు ధరించాలన్నారు.ప్రభుత్వ ఆసుపత్రులో ఏర్పాట్లు చేసిన వ్యాక్సిన్ కేంద్రాల్లో ఎలాంటి రుసుము లేకుండా టీకా వేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ .250 చెల్లించాలి వేసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజు లక్ష 20వేల మంది వ్యాక్సిన్ తీసుకునేలా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
Mayor Vijayalakshmi takes Covid-19 vaccine