హైదరాబాద్: బతుకమ్మ పండగ, దేవి నవరాత్రులను పురస్కరించుకుని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి నగరవాసులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… బతుకమ్మ పండుగ అంటే ప్రకృతిని పూజించడమన్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కావడం, 9 రోజుల పాటు ఈ పండుగను చిన్నా పెద్ద తేడా లేకుండా మహిళలు ఉత్సాహంగా జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాలు సైతం గురువారం నుంచి ప్రారంభం కానున్నాయని, శక్తి స్వరూపిణీ అయిన అమ్మవారికి తొమ్మిది రోజుల పాటుపూజలు చేయడం నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకత అని పేర్కొన్నారు. మహిళా శక్తికి ప్రతిరూపంగా అమ్మవారు వివిధ రూపాల్లో దర్శమిస్తుంటారని ఈ రోజుల్లో మహిళలు అనేక పాత్రలు పోషిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నరన్నారు. ఒకవైపు కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే మరోవైపు ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో కూడా రాణిస్తున్న విషయం అందరికి తెలిసిందేనని మేయర్ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలపై అమ్మవారి దయ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాని తెలిపారు.
బతుకమ్మ, నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన మేయర్ విజయలక్ష్మి
- Advertisement -
- Advertisement -
- Advertisement -