హైదరాబాద్: నాలా పనుల్లో మరింత వేగం పెంచాలని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. రూ.12.86 కోట్లవ్యయంతో ఏజికాలనీ నుంచి లక్ష్మి కాంప్లెక్స్ వరకు చేపట్టిన సనత్ నగర్ నాలా పనులను ఎర్రగడ్డ వద్ద బుధవారం మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ వరద కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా వర్ష కాలం నాటికి పనులన్ని పూర్తి చేయలన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాలతో డైనమిక్ మంత్రి కెటిఆర్ సారథ్యంలో నాలాల అభివృద్ది పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
మొదటి దశ కింద రూ.858 కోట్ల అంచనా వ్యయంతో 60 పనులను చేపట్టగా యుద్ద ప్రాతిపదికన ప్రాధాన్యత క్రమంలో సాగుతున్నాయన్నారు పనులను తెలిపారు. ఈ 60 పనుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో 37 పనులు మిగిలిన 23 పనులు చుట్టూపక్కన ఉన్న మున్సిపాలిటీల్లో చేపట్టినట్లు ఆమె వెల్లడించారు. నాలా పనుల పురోగతికి సంబంధించి ఓ రోజుక రోజు సమాచాంర అందించాలని అధికారులను మేయర్ అదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవికిరణ్; ఎస్‌ఈ భాస్కర్‌రెడ్డి, ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.