- Advertisement -
హైదరాబాద్ : వినాయక చవితి పర్వదినం సందర్భంగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ.. గత సంవత్సరం ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులకు రిక్వెస్ట్ చేసినందున ఈ సంవత్సరము నగరంలో మొదటిసారి ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని మట్టితో తయారు చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరు ఈకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులను మాత్రమే ఉపయోగించాలని పర్యావరణ హితానికి తోడ్పడాలి అన్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -