Wednesday, January 22, 2025

రోడ్డుప్రమాదంలో గాయపడ్డ ఎస్‌ఎఫ్‌ఎ శ్రీకాంత్‌ను పరామర్శించిన మేయర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ సర్కిల్ లో శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీకాంత్‌ను బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరామర్శించారు. శ్రీకాంత్ తన విధుల్లో భాగంగా ద్విచక్ర వాహనం పై వెళుతుండగా కుక్క అడ్డగా రావడంతో ఆయన ద్విచక్ర వాహనం పై నుండి క్రింద పడి తీవ్ర గాయాపడ్డారు. దీంతో ఆయనను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి హాస్పిటల్ కు వెళ్లి శ్రీకాంత్ ను పరామర్శించారు.ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ లను అడిగి శ్రీకాంత్ ఆరోగ్య పరిస్థితి అరా తీయడంతో పాటు కుటుంబ సభ్యులకు ధైర్యం తెలిపారు. మెరుగైన చికిత్స అందించాలని ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ లను కోరారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ ఆసుపత్రిలో శ్రీకాంత్‌ను పరామర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News