Saturday, April 19, 2025

నీటి శుద్దీకరణ కేంద్రాన్ని సందర్శించిన మేయర్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: వర్షాకాలంలో తాగునీటి శుద్దీకరణ ప్రక్రియలో ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్నామని మేయర్ వై సునీల్‌రావు అన్నారు. నగరపాలక సంస్థ మంచినీటి సరఫరాలో భాగంగా బుధవారం నగర మేయర్ వై సునీల్‌రావు మానేరు డ్యాం, ఐటీ టవర్ సమీపంలోని నీటి శుద్దీకరణ కేంద్రాన్ని సందర్శించారు.

నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, ఫిల్టర్ బెడ్ సిబ్బందితో కలిసి నీటి శుద్దీకరణ విధానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఫిల్టర్ బెడ్‌లోని నీటి పరీక్ష ప్రయోగాలలో స్వయంగా మేయర్ శుద్దిచేయబడిన నీటిని సేకరించి టెక్నిషన్‌తో నీటి నాణ్యత పరీక్షను చేయించారు. ప్రయోగశాలలో పరీక్ష చేసిన ఈనటిని పరిశీలించి ఖచ్చితమైన ప్రమాణాలు, కొలతలు పాటించి నీటిని శుద్ది చేయాలని అధికారులు, ఫిల్టర్ బెడ్ సిబ్బందిని ఆదేశించారు.

ఫిల్టర్ బెడ్‌కు మానేరు డ్యాం నుండి వచ్చే రావాటర్ టర్మినిటి నుండి శుద్దీచేయబడిన నీటి టర్మినిటిని నిశితంగా పరిశీలన చేశారు. నీటి శుద్దీకరణ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై నీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అధికారులు, ఫిల్టర్ బెడ్ సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ నాగమల్లేశ్వర్‌రావు, ఈఈ మహేందర్, డీఈ లచ్చిరెడ్డి, ఏఈ గట్టుస్వామి, ఫిల్టర్ బెడ్ ఇంచార్జి విజయ్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News