Thursday, January 23, 2025

బిఆర్‌ఎస్‌ను మళ్లీ ప్రజలు ఆదరిస్తారనే బండికి భయం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్:బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మల్లీ ప్రజలు ఆదరిస్తారనే భయం, అభద్రతా బావంతో ఎంపీ బండి సంజయ్ వ్యవహరస్తున్నారని.. అందుకే స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల పై అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు మండిపడ్డారు. మంగళవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గెలిచిన 4 ఏళ్ళ నుండి నగర అభివృద్ధి, ప్రజా సేవ అంటే తెలియదా…ఎన్నికలు సమీపిస్తుండటంతో అభివృద్ధి, ప్రజా సేవ గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. నగరంలో పర్యటించి ఇన్నాళ్ళకు స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు వీక్షించినందుకు చాలా సంతోషమన్నారు. జరుగుతున్న అభివృద్ధి ని చూసి కూడ అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని మండి పడ్డారు.

బండి సంజయ్ ఎంపీ కాక ముందే కరీంనగర్ నగరానికి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్ ఆశీస్సులతో కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ హోదా దక్కిందన్నారు. మా పాలకవర్గం ఏర్పడక స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో కేవలం 21 లక్షల నిధుల పనులు మాత్రమే జరిగాయని…మా నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత వివిధ ప్రాజెక్టుల కింద దాదాపు 900 కోట్ల రూపాయల పనులు ప్రారంభమయ్యాని స్పష్టం చేశారు. ఇందులో దాదాపు 700 కోట్ల రూపాయల పనులు పూర్తి చేయడం జరిగిందని ఇది మాకు చాలా గర్వకారణం అన్నారు. ఎంపిగా గెలిపించిన ప్రజలకు మీరు ఏం చేశారనేది ఒక్కసారి ఆత్మపరిశీలన చేస్కోవాలని అన్నారు. నగరంలో మోర్ సూపర్ మార్కెట్ నుండి శాతవాహన యూనివర్ సిటీ నుండి స్మార్ట్ రోడ్డు, భగత్ సింగ్ చౌరస్తా నుండి రాంచంద్రాపూర్ వరకు కూడ స్మార్ట్ రోడ్డు వేసాం…

ఈ ప్రాంతాల్లో ఒక వైపు బీజేపి కార్పోరేటర్లు ఉంటే మరో వైపు బీఆర్‌ఎస్ కార్పోరేటర్లు మరో వైపు ఎంఐఎం కార్పోరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ కార్పోరేటర్లు ఉన్న చోట పనులు చేస్తున్నారని ఆరోపనలు చేయడం బండి సంజయ్ సరికాదన్నారు. బండి సంజయ్ లాగా కచ్చితమైన మనసు మాకు లేదని..అభివృద్ధి, ప్రజల సంక్షేమమే మా ధ్యేయం అన్నారు. బీజేపి, బీఆర్‌ఎస్, ఎంఐఎం కార్పోరేటర్ల డివిజన్లు అనే తేడా తారతమ్యం లేకుండ నగరాన్ని సమాపాలల్లో అభివృద్ధి చేయడం మా ప్రధాన లక్ష్యం అన్నారు. మీ లాగా ఎంపీ ల్యాడ్ నిధులు మీ బీజేపి కార్లోరేటర్లకు ఇచ్చినట్లు కాదని ఎద్దేవ చేశారు. 4 ఏళ్ల కాలంలో కరీంనగర్ నగరానికి కోటి రూపాయల ఎంపీ నిధులు ఇస్తే…అవి మీ బీజేపి కార్పోరేటర్లు కు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. మీది విభజన విచ్చిన్నం చేసే రాజకీయమని…

అసత్యాల తో రాజకీయ పబ్బం గడుపుతున్న సంస్కృతి అని ఆరోపించారు. ఒక్క రోజైనా స్మార్ట్ సిటీ అభివృద్ధి పై మా తో చర్చించిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా…అని ప్రశ్నించారు. కొంత మంది మాట్లాడుతున్నారు స్మార్ట్ సిటీ అడ్వైజర్ బోర్డు చైర్మన్ గా ఎంపీ ఉన్నరని…తెలిసి మాట్లాడుతారో తెలియక మాట్లాడుతోరో కానీ అన్ని తప్పుడు వాక్యలే. అడ్వైజర్ బోర్టు చైర్మన్ గా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు, మెంబర్లుగా ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్, కమీషనర్, సీనియర్ ఇంజనీర్ ఉంటారు. బోర్డు మీటింగ్ కూడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఒక ప్రతినిధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపాల్ చీఫ్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ, సీడీఎంఏ అధికారి, డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్ కమిటీ అధికారి, మేయర్, ఇతర ఉన్నతధికారుల సమక్షంలో అభివృద్ధి నిర్ణయాలు తీస్కోని ప్రజలకు ఏవి కావాలో అవి సమకూర్చడం జరుగుతుందన్నారు. కొంత మంది మాట్లాడుతున్నారు స్మార్ట్ సిటీ కి కేంద్రం ప్రభుత్వం షేర్ నిధులు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వలేదని….

ఇప్పటి వరకు 500 కోట్ల నిధులు వస్తే సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. తీగలగుట్టపల్లి రైల్వే బ్రిడ్జ్ కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించలే….సెంట్రల్ రోడ్డ్ ఫండ్ నుండి రాష్ట్రానికి కేటాయించే నిధులేవైతే ఉన్నాయో ఆ నిధుల నుండి మాత్రమే రైల్వే బ్రిడ్జ్ కు నిధ కేటాయించారని స్పష్టం చేశారు. సెంట్రల్ రోడ్డు ఫండ్ అనేది కేంద్రం లో ఏ ప్రభుత్వం ఉన్న విధిగా విడిదల చేయాల్సిందే నని అన్నారు. 25 ఓవర్ బ్రిడ్జ్ లు అడిగిత కేవలం 5 ఓవర్ బ్రిడ్జ్ లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ కార్పోరేటర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News