Monday, February 24, 2025

ఫ్యామిలీ అంతా చూసే సినిమా

- Advertisement -
- Advertisement -

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ మోస్ట్ ఎవైటెడ్ 30వ చిత్రం ‘మజాకా’. ధమాక బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎంటర్‌టైనింగ్ అండ్ ఎంగేజింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించబోతోంది. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాత. మేకర్స్ ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. రావు రమేష్, సందీప్ కిషన్ తండ్రీ కొడుకులు. ఎటువంటి కట్టుబాట్లు, బాధ్యతలు లేకుండా జీవితాన్ని బ్యాచిలర్స్‌లా హాయిగా గడుపుతుంటారు. సందీప్‌కు రీతు వర్మపై ప్రేమ కలుగుతుంది, అతని తండ్రి రావు రమేష్ అన్షుని ఇష్టపడతాడు. దీంతో సాఫీగా వున్న వీరి జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ట్రైలర్ మజాకా మాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ యొక్క గ్లింప్స్‌ని అందిస్తుంది, సినిమాలో వుండే వినో దం, ఉత్సాహాన్ని రుచి చూపిస్తుంది.

త్రినాధ రావు నక్కిన నలుగురు ప్రధాన పాత్రల చుట్టూ హిలేరియస్ కథను రూపొందించారు, ఫిబ్రవరి 26న మహా శివరాత్రికి విడుదల కానున్న ఈ సినిమాపై ట్రైలర్ భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ ఈవెంట్‌లో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘మజాకా సినిమా రెండు గంటలపాటు లాఫ్ రైడ్‌గా వుంటుంది. థియేటర్స్‌లో చాలా గట్టి నవ్వులు వినిపిస్తాయి. నా కెరీర్‌లో హయ్య స్ట్ నెంబర్స్ ఈ సినిమా ఇస్తుంది. థియేటర్స్‌లో ఫ్యామిలీస్ అంతా చూసే సినిమా ఇది. యూని ట్ అంతా మంచి ఎంటర్‌టైనర్ ఇవ్వడానికి కష్టపడి పనిచేశాము‘ అని అన్నారు. త్రినాథ రావు నక్కిన మాట్లాడుతూ.. -‘ఈ సినిమాలో బ్యూటీఫుల్ ఎమోషన్ వుంది. -అందరూ కాసేపు తమ బాధలు మర్చిపోయి ఓ రెండు గంటల పాటు రిలాక్స్‌గా హాయిగా నవ్వుకునే సినిమా ఇది’ అని తెలిపారు. నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. ‘ప్రతిఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. సందీప్, రావు రమేష్ పోటీపడి నటించారు. రీతు వర్మ డ్యాన్స్‌తో అదరగొట్టింది’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రావు రమేష్, అనిల్, రీతూ వర్మ, అన్షు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News