పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్‌లో రీతు వర్మ హీరోయిన్. ఆదివారం మజాకా హైలీ ఎంటర్‌టైనింగ్ టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. మజాకా ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా విడుదల కానుంది.
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘ఆడియన్స్ నా నుంచి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని కోరుకుంటున్నారని వారితో మాట్లాడినప్పుడు తెలిసింది. ముఫ్ఫై సినిమాలు చేయడం అంటే ప్రేక్షకులు ఇచ్చిన వరం. వారు కోరుకున్న సినిమా చేయడం నా బాధ్యత. అలాంటి సమయంలో ‘మజాకా’ నా దగ్గరకి వచ్చింది. ‘మేము వయసుకు వచ్చాం’ సినిమా చూసినప్పటినుంచి త్రినాధ్‌తో పనిచేయాలని వుండేది. ఫైనల్‌గా ‘మజాకా’తో కుదిరింది. త్రినాధ్, ప్రసన్న చాలా నిజాయతీగా పనిచేస్తారు. ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే సినిమా ఇది‘ అని అన్నారు.
డైరెక్టర్ త్రినాథ్ నక్కిన మాట్లాడుతూ.. “మజాకా నాకు చాలా ఇష్టమైన కథ. సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సందీప్‌తో సినిమా చేయాలని వుండేది. ఈ సినిమా తనతో చేయడం చాలా ఆనందంగా ఉంది‘అని పేర్కొన్నారు. నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. ‘మజాకా కథ వినప్పుడు నాన్‌స్టాప్‌గా రెండు గంటలు నవ్వుకుంటూనే వున్నా. ఈ సినిమాకి ఎవరు కావాలో కథే తీసుకొచ్చింది. మన్మధుడు తర్వాత అన్షు రీలాంచ్ అవుతున్నారు. చాలా మంచి పేరు వస్తుంది. రావు రమేష్ పాత్ర నవ్వించి నవ్వించి ఆడియన్స్ పేపర్లు చించేలా వుంటుంది. సందీప్ కథ వినగానే చేసేద్దామని అన్నారు‘ అని తెలిపారు. ఈ కార్యక్రమం లో హీరోయిన్ అన్షు, రైటర్ ప్రసన్న, రావు రమేష్ తదితరులు పాల్గొన్నారు.