ప్రొబేషనరీ ఐఎఎస్ అధికారి పూజా ఖేద్కర్ విద్యకు సంబంధించి సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆమె తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఎంబీబీఎస్‌లో చేరినట్టు ఇప్పుడు అనుమానాలు బలపడుతున్నాయి. పుణెలోని కాశీబాయి నవలె మెడికల్ కాలేజీ అండ్ జనరల్ హాస్పిటల్‌లో 2007లో ఎన్‌టీ 3 కేటగిరి కింద నాన్ క్రిమీలేయర్ ఓబీసీ ధ్రువీకరణ పత్రంతో సీట్ పొందారు. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వార్తా సంస్థవద్ద సోమవారం మెడికల్ కాలేజీ డైరెక్టర్ అరవింద్ బొహ్రె ధ్రువీకరించారు.
2007 లో అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజస్ ఆఫ్ మహారాష్ట్ర ప్రవేశ పరీక్షరాసి పూజా మెడికల్ సీట్ తెచ్చుకున్నారు. ఆమె ఈ పరీక్షల్లో 200 కు 146 మార్కులు సాధించారు. ఆమె మహారాష్ట్ర కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాయాలనుకున్నా , అప్పటికే రాసిన పరీక్షలో సరిపడా మార్కులు రావడంతో నాన్ క్రీమీలేయర్ ధ్రువీకరణ పత్రం సమర్పించి వైద్య కళాశాలలో చేరారు. ఈ కాలేజీ తొలి బ్యాచ్ విద్యార్థుల్లో ఆమె కూడా ఒకరు. అప్పట్లో ఆమె పత్రాలు మొత్తం తాము పరిశీలించగా, సదరు వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో కూడా సరిపోలినట్లు అరవింద్ వెల్లడించారు. ఈ నాన్ క్రిమీలేయర్ ధ్రువీకరణను అహ్మద్‌నగర్ లోని పథార్డి సబ్‌డివిజన్‌లో జారీ చేసినట్టు వెల్లడించారు.
ఖేద్కర్‌కు 10 వ తరగతిలో 83 శాతం, 12 వ తరగతిలో 74 శాతం, మార్కులు వచ్చాయి. ఆమె 201112లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఇంటర్న్‌షిప్ కూడా నవలే కాలేజీలోనే చేశారు. అప్పట్లో ఆమె కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేశారు. ప్రస్తుతం పూజా చుట్టూ వివాదాలు ముసురుకొన్నాయి. మోటారు వాహనాల చట్టాన్నిఉల్లంఘిస్తూ ఆమె కారుకు సైరన్, మహారాష్ట్రప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను వాడడం, 21 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడడంతో ఈ చర్యలు తీసుకున్నట్టుగా పేర్కొన్నారు.