Monday, January 27, 2025

తమిళంలో ఎంబిబిఎస్ కోర్సుకు ప్రతిపాదన

- Advertisement -
- Advertisement -

MBBS in Tamil

పుదుచ్చేరి: లెఫ్టినెంట్ గవర్నర్ తమిళ్ ఇసై సౌందరరాజన్ స్థానిన ప్రభుత్వం తమిళ్ మీడియంలో ఎంబిబిఎస్ కోర్సును ప్రారంభించాలని ప్రతిపాదించిందన్నారు. సీనియర్ సిటిజెన్ల గౌరవార్థం ఏర్పాటుచేసిన ఓ వేడుక తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. తమిళ్ మీడియం ఎంబిబిఎస్ కాలేజ్ తెరువడానికి సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి రంగసామితో సంప్రదిస్తానని కూడా ఆమె తెలిపారు. “వైద్య విద్యకు సంబంధించిన పుస్తకాలను తయారుచేయడానికి ఓ కమిటీని కూగా ఏర్పాటు చేయనున్నట్లు” ఆమె తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ప్రజలపై ఏ బాషను రుద్దడంలేదని, కాకపోతే వారు మాతృ భాషలోనే వృత్తి విద్య కళాశాలలను తెరువాలని వారు కోరుకుంటున్నారని అన్నారు. పుదుచ్చేరిలో పాల కొరతను నివారించేందుకు తాము చర్యలు చేపడుతున్నట్లు కూడా ఆమె ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News