Monday, January 20, 2025

ఎంబిబిఎస్ ఇన్ హిందీ?

- Advertisement -
- Advertisement -

 

MBBS in Hindi

భోపాల్: 2022-2023 అకడమిక్ సెషన్ నుండి హిందీలో ఎంబిబిఎస్  కోర్సును ప్రారంభించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం మార్గం సరికొత్త నిర్ణయం తీసుకున్నప్పటికీ, హిందీలో పుస్తకాలు  లేనందున వైద్య రంగంలో నిపుణులు ఈ చర్యపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొత్త అకడమిక్ సెషన్ నుండి, భోపాల్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థులకు బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (ఎంబిబిఎస్) కోర్సును హిందీలో బోధించనున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ప్రకటించారు.

ప్రస్తుతం వైద్య విద్య ఆంగ్లంలో మాత్రమే బోధిస్తున్నారు. అంతేకాకుండా, జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి)లో భాగంగా ఒక్కొక్కటి ఆరు కళాశాలల్లో బిటెక్ డిగ్రీ , పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను హిందీ భాషలో బోధించనున్నట్లు చౌహాన్ ప్రకటించారు. ‘‘ఎంబిబిఎస్‌ను హిందీలో బోధించే  దేశంలోనే మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్’’ అని రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్  సారంగ్ అన్నారు. సీనియర్ బిజెపి నాయకుడు , వృత్తిరీత్యా వైద్యుడు డాక్టర్ హితేష్ బాజ్‌పాయ్ ఈ చర్యకు మద్దతు ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది…పనిలో పనిగా హిందీలో ఎంబిబిఎస్ అని బోర్డు కూడా తగిలించుకుంటే పేషంట్లు కాస్తా ఆలోచించుకుని బాగానే వెళతారేమో మరి చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News