Monday, December 23, 2024

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి

- Advertisement -
- Advertisement -

 ఉక్రెయిన్ విద్యార్థి తల్లిదండ్రులు


మన తెలంగాణ/షాబాద్: వైద్య విద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్ దేశంవెళ్లిన షాబాద్‌కు చెందిన విద్యార్ధి పబ్బ సాయితరుణ్ అక్కడే ఇరుక్కుపోయారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతవరణం కారణంగా విద్యార్ధి తల్లిదంత్రులు పబ్బ ప్రవీణ్, సంగీతలు ఆందోళన చెందుతున్నారు. గురువారం మండల కే ంద్రంలో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పం దించి, తమ అబ్బాయిని సురక్షితంగా మనదేశానికి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ఉక్రెయి న్ సమీపంలోని వినిస్తా యూనివర్సిటీలో ఎంబిబిఎస్ రెండవ సంవత్సరం సాయితరుణ్ అభ్యసిస్తున్నాడన్నారు. గత రెండు రోజులుగా అక్కడి వాతావరణం భయాందోళనరకంగా ఉన్నట్లు సాయితరుణ్ తెలిపినట్లు వారు తెలిపారు.

 ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపధ్యంలో ఉక్రెయిన్‌కు ఉన్నత విద్య కోసం వెళ్లిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన సిద్దిపేట జిల్లా కొండ పాక మండలం బందారం గ్రామానికి చెందిన కొర్తివాడ అజిత్ ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంపై వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడు క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందిస్తున్నడని తెలిపారు. ఏదిఏమైనా తమ కుమారుడు క్షేమంగా ఇంటికి చేరాలని అన్నారు. ఇక్కడకు వచ్చేందుకు అనేక ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతోందని అన్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా భారత ప్రభుత్వం వారిని భారతదేశానికి క్షేమంగా తీసుకురావాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News