Sunday, December 22, 2024

రోడ్డు ప్రమాదానికి గురైన అమ్జద్ ఉల్లాహ్ ఖాన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మజ్లీస్ బచావో తెహ్రీక్(ఎంబిటి) ప్రతినిధి అమ్జద్ ఉల్లాహ్ ఖాన్ మంగళవారం మలక్ పేట్ లోని అక్బర్ బాగ్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. దాంతో ఆయనను మలక్ పేట లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స జరుగుతోంది. రోడ్డు ప్రమాదంలో ఆయన చేయి ఫ్రాక్చర్ అయింది. అందుకు ఆయనకు సర్జరీ చేయాల్సి ఉంటుంది. లోక్ సభ ఎన్నికల్లో ఎంబిటి పోటీ చేయకపోయినప్పటికీ పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓటేయాలని విలేకరుల సమావేశంలో చెప్పారు. ఎంబిటి అధ్యక్షుడు మజీదుదుల్లా ఖాన్ ఉరఫ్ ఫర్హత్ ఖాన్ ఎంబిటి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. కాగా అమ్జద్ ఉల్లా ఖాన్  కూడా నిన్న పెద్ద సంఖ్యలో ఓటేయాలని నగర వాసులకు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News