Thursday, December 26, 2024

గుండెపోటుతో ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే న్యూయార్క్ లో గుండెపోటుతో మృతి చెందారు. టి20 ప్రపంచ కప్ మ్యాచ్ చూసేందుకు న్యూయార్క్ వెళ్లి ఆయన న్యూయార్క్ నసావు కౌంటీ క్రికెట్ మైదానంలో మ్యాచ్ వీక్షించారు.

మ్యాచ్ ముగిసిన కొద్ది గంటలకే హోటల్ కి వెళ్లిన ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన మరణంపై క్రికెట్ వర్గాలు సంతాపాన్ని ప్రకటించాయి. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు అమోల్ కాలే అత్యంత సన్నిహితుడు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టీ కూడా.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News