- Advertisement -
న్యూఢిల్లీ : టమోట ధరల పెరుగుదల షాక్ ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్‌ను కూడా తాకింది. ఈ కంపెనీ తయారు చేసే బర్గర్‌ల నుండి టమోటాలను తొలగించింది. టమోటాల కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని మెక్‌డొనాలడ్స్ ఇండియా నార్త్ అండ్ ఈస్ట్ ఫ్రాంచైజీ ప్రకటించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా నాణ్యమైన టమాటను పొందలేకపోతున్నామని సంస్థ తెలిపింది.
భారీ వర్షాల కారణంగా దేశంలో టమాటా ధర కిలో రూ.140 పైనే ఉంది. ఇది తాత్కాలిక సమస్య, త్వరలో కస్టమర్‌లను తిరిగి మెనూలోకి టమోటాలను తీసుకువస్తామని కంపెనీ భరోసా ఇచ్చింది. 2016 సంవత్సరంలో కూడా నార్త్, ఈస్ట్ ఫ్రాంచైజీలు తమ మెనూ నుండి టమోటాలను తొలగించాయి. అప్పుడు కూడా టమోటాల కొరత ఉండడమే కారణం, ఇప్పుడు అలాంటి నిర్ణయమే తీసుకున్నారు.
- Advertisement -