Monday, December 23, 2024

సీఎస్ఐఆర్-సిఎఫ్ టిఆర్ఐతో మెక్‌డొనాల్డ్స్ ఇండియా భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ ద్వారా నిర్వహించబడుతున్న మెక్‌డొనాల్డ్స్ ఇండియా (వెస్ట్ & సౌత్), అద్భుతమైన మల్టీ-మిల్లెట్ బన్‌ను విడుదల చేసేందుకు కేంద్ర శాస్త్ర & సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రతిష్టాత్మకమైన ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, సీఎస్ఐఆర్ -సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిఎఫ్ టిఆర్ఐ)తో భాగస్వామ్యం చేసుకుంది. ఈ ప్రత్యేకమైన, మొట్టమొదటి భాగస్వామ్యం , సీఎస్ఐఆర్ -సిఎఫ్ టిఆర్ఐ యొక్క నైపుణ్యం మరియు పోషక ఆహార ఎంపికలను అభివృద్ధి చేయడంలో మెక్‌డొనాల్డ్ యొక్క నిబద్ధతతో కలిపి ఆహార ఆవిష్కరణలో కొత్త శకాన్ని సూచిస్తుంది. జాతీయ పోషకాహార వారోత్సవం సందర్భంగా, ఈ ముఖ్యమైన ముందడుగు మెక్‌డొనాల్డ్ యొక్క పోషకాహార ప్రయాణంతో సమలేఖనం చేయబడింది, తమ ఉత్పత్తుల పోషకాహార ప్రొఫైల్‌ను మెరుగుపరచడంలో దాని నిబద్ధతను బలపరుస్తుంది.

సీఎస్ఐఆర్ -సిఎఫ్ టిఆర్ఐ యొక్క ప్రముఖ ఆహార శాస్త్రవేత్తలు, మెక్‌డొనాల్డ్స్ ఇండియా (డబ్ల్యు &ఎస్) సంయుక్తంగా సృష్టించిన కొత్త మల్టీ-మిల్లెట్ బన్‌లో ఐదు పోషకాలు అధికంగా ఉండే , పెద్ద మరియు చిన్న తృణ ధాన్యాలు (మిల్లెట్‌లు) – సజ్జలు (బజ్రా) , రాగి, జొన్నలు (జోవర్) , వరిగెలు(ప్రోసో) మరియు అరికెలు (కోడో) ఉన్నాయి. పోషకాహార ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన ఈ సూపర్‌ఫుడ్‌లు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్‌లతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించబడ్డాయి, ఇవి స్థానిక, స్థిరమైన సోర్సింగ్‌పై మెక్‌డొనాల్డ్స్ భారతదేశం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తాయి.

సీఎస్ఐఆర్ -సిఎఫ్ టిఆర్ఐ లోతైన నైపుణ్యం, మెక్‌డొనాల్డ్స్ యొక్క ప్రసిద్ధి చెందిన రుచి, ఆకృతి మరియు నాణ్యత యొక్క సున్నితమైన సమతుల్యతను సాధించేటప్పుడు మిల్లెట్ యొక్క పోషక ప్రయోజనాలను సజావుగా ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఫలితంగా అవసరమైన విటమిన్లు, మినరల్స్, సహజమైన డైటరీ ఫైబర్‌తో నిండిన బన్ను ఉత్పత్తి చేయబడింది. ఇది కొరికిన ప్రతి సారి పోషకాహారం మరియు ఆనందం రెండింటినీ అందిస్తుంది.

సీఎస్ఐఆర్ -సిఎఫ్ టిఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ శ్రీదేవి అన్నపూర్ణ సింగ్ మాట్లాడుతూ, “మెక్‌డొనాల్డ్స్ ఇండియా (డబ్ల్యు &ఎస్)తో మా భాగస్వామ్యం అధునాతన ఆహార సాంకేతికత, పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న ఉత్తమ విధానాల, వ్యూహాత్మక ఏకీకరణను సూచిస్తుంది. ఈ ఉమ్మడి ప్రయత్నం అదనపు పోషక విలువలను అందించే మెనూ ఐటెమ్‌లను అభివృద్ధి చేయడంలో కీలకమైన ముందడుగుగా నిలుస్తుంది. సీఎస్ఐఆర్ -సిఎఫ్ టిఆర్ఐ యొక్క అత్యాధునిక పరిశోధన సామర్థ్యాలతో, మెక్‌డొనాల్డ్స్ ఇండియా యొక్క కార్యాచరణ నైపుణ్యం, నాణ్యత పట్ల నిబద్ధతతో కలిపి, మేము ఆహారానికి గొప్ప భవిష్యత్తును అందించే కొత్త శకానికి నాంది పలుకుతున్నామని నమ్ముతున్నాము..” అని అన్నారు.

మెక్‌డొనాల్డ్స్ ఇండియా (డబ్ల్యు &ఎస్), సీఎస్ఐఆర్ -సిఎఫ్ టిఆర్ఐ మధ్య ఈ దీర్ఘకాలిక భాగస్వామ్యం, తుది వినియోగదారుని దృష్టిలో ఉంచుకునే ప్రయోజనాలతో పోషకాహార ఆవిష్కరణలో కొత్త మార్గాలను అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకుంది. రెండు సంస్థలూ కలిసి, ఆధునిక ఆహార శాస్త్రం మరియు సాంకేతికతతో మిల్లెట్ వంటి సాంప్రదాయ పదార్ధాలను కలపడంపై దృష్టి సారించాయి, కస్టమర్ల మారుతున్న ఆహార ప్రాధాన్యతలకు ఆరోగ్యకరమైన, రుచికరమైన క్యాటరింగ్ మెను ఐటెమ్‌లను రూపొందించడానికి కట్టుబడి ఉన్నాయి.

మెక్‌డొనాల్డ్స్ ఇండియా (డబ్ల్యు &ఎస్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అక్షయ్ జటియా మాట్లాడుతూ , “మెక్‌డొనాల్డ్స్ ఇండియా (డబ్ల్యు &ఎస్)లో మేము ‘రియల్ ఫుడ్ దట్ ఈజ్ రియల్ గుడ్ ‘ అనిపించే ఆహరం అందించటానికి దీర్ఘకాల ప్రయాణంలో ఉన్నాము. మల్టీ-మిల్లెట్ బన్‌ను పరిచయం చేయడమనేది మా కస్టమర్‌లు ఇష్టపడే రుచికి అనుగుణంగా మా ఆఫర్‌ల పోషక విలువలను పెంపొందించడానికి కొనసాగుతున్న మా ప్రయత్నాలకు ప్రతిబింబం. జాగ్రత్తగా తినే ఎంపికలను అందించడానికి మా మిషన్‌ను మరింత ముందుకు తీసుకువెళ్తున్న ప్రయత్నంలో ఈ ప్రత్యేకమైన ఉత్పత్తికి జీవం పోయడంలో మాకు సహాయపడుతూ అమూల్యమైన నైపుణ్యం అందించిన సిఎఫ్ టిఆర్ఐ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అని అన్నారు.

మల్టీ-మిల్లెట్ బన్‌ను విడుదల చేయటం అనేది మెక్‌డొనాల్డ్స్ ఇండియా యొక్క ‘రియల్ ఫుడ్ రియల్ గుడ్’ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది, ఇది ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. ఈ సిద్దాంతం నాణ్యతపై బ్రాండ్ యొక్క అచంచలమైన దృష్టిని నొక్కి చెబుతుంది, మెను ఐటెమ్‌లు కృత్రిమ రంగులు, కృత్రిమ రుచులు, కృత్రిమ ప్రిజర్వేటివ్‌లు లేకుండా ఉంటాయి మరియు చికెన్ ఆఫర్‌లలో ఎంఎస్జి జోడించబడలేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా, మెక్‌డొనాల్డ్స్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సప్లయర్‌ల నుండి తాజా, స్థానికంగా లభించే పదార్థాలను ఉపయోగించేందుకు కట్టుబడి ఉంది, దాని విలువైన కస్టమర్‌లకు విశ్వసనీయ భాగస్వామిగా మారింది.

వెస్ట్ మరియు సౌత్ ఇండియాలోని వినియోగదారులు ఇప్పుడు క్లాసిక్ మెక్‌ఆలూ టిక్కీ నుండి మండుతున్న మెక్‌స్పైసీ పనీర్ వరకు కొత్త మల్టీ-మిల్లెట్ బన్‌ను ఎంచుకోవడం ద్వారా అదనపు ప్రయోజనాలతో కూడిన పోషక అవతారం లో తమ సమీపంలోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌లలో, ఆన్ -ద -గో -డ్రైవ్-త్రూ, మెక్‌డెలివరీ యాప్ ద్వారా ఆర్డర్ చేయడం ద్వారా తమ అభిమాన బర్గర్‌లను రుచి చూడవచ్చు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News