Monday, January 20, 2025

హైదరాబాద్‌లో మెడిలాంజ్ ను ప్రారంభించిన ఎం క్యూరా మొబైల్ హెల్త్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎం క్యూరా మొబైల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల ప్రీమియం ఇంటిగ్రేటెడ్ డైరెక్ట్, టెలికన్సల్టేషన్ ప్లాట్‌ఫారమ్, మెడిలాంజ్ ని పరిచయం చేసింది. స్థానిక పాలిక్లినిక్స్, మధ్య-పరిమాణ ఆసుపత్రులకు ఒక వరంలా నిలిచే, మెడిలాంజ్ యొక్క హబ్-అండ్-స్పోక్ మోడల్, నగరాల్లో, విదేశాలలో కూడా నిపుణుల సేవలను రోగులు పొందడంలో సహాయపడుతుంది.

హైదరాబాద్‌లోని ఎ.ఎస్. రావు నగర్ లో వున్న ఈ లాంజ్ సదుపాయంలో ప్రీమియం ఇంటిగ్రేటెడ్ డైరెక్ట్, టెలికన్సల్టేషన్‌ను అందిస్తుంది. స్మార్ట్ OPD పరివర్తనలో అగ్రగామిగా ఉన్న మెడిలాంజ్, ముందస్తు అసెస్‌మెంట్ సేవలు, ఐఓటి-ఆధారిత తక్షణ పరీక్షలు అలాగే నిపుణులతో టెలికన్సల్టేషన్‌ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఎం క్యూరా వ్యవస్థాపకులు & సీఈఓ మధుబాల రాధాకృష్ణన్ మాట్లాడుతూ…“మెడిలాంజ్ అనేది నెక్స్ట్-జెన్ టెలికన్సల్టేషన్ ప్లాట్‌ఫారమ్, ఇది సమగ్ర వ్యాధి నిర్వహణ కోసం పూర్తి కేసు ఫైల్‌ను సృష్టించటం, నిపుణుల కన్సల్టేషన్ తో పాటు ఇంటిగ్రేటెడ్ ప్రీ-అసెస్‌మెంట్ మాడ్యూల్‌ను అందిస్తుంది. ఇది డాక్టర్ టు డాక్టర్ కమ్యూనికేషన్‌ని సాధ్యం చేయడం ద్వారా భారతదేశంలోని రోగులకు ఆరోగ్య సంరక్షణలో అంతరాన్ని తగ్గిస్తుంది.” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News