Wednesday, January 22, 2025

ఫతే నగర్ ఎస్టీపీని సందర్శించిన ఎండి దానకిశోర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జలమండలి ఎస్టీపీల ప్రాజెక్టు ప్యాకేజీ-3 లో భాగంగా నిర్మిస్తున్న ఫతే నగర్ మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని ఎండీ దానకిశోర్ సోమవారం సందర్శించారు. ఐఎన్డీ, ఇన్ లెట్ తదితర పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎస్టీపీ పనులు 80 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటికే ఎస్బీఆర్, సీసీటీ, సివిల్ పనులు పూర్తి చేసుకుని, యంత్రాలను బిగింపు పనులు మొదలయ్యాయన్నారు. ఐఎన్డీ, బ్లోయర్ రూమ్, పీటీయూ తదితర నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయని వివరించారు. అవసరమైతే కార్మికుల సంఖ్యను పెంచి మిగిలిన పనులను సైతం తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీపీ ప్రాంగణంలో ఆహ్లాదకర వాతావరణం, పచ్చదనం కోసం గార్డెనింగ్, అవసరమైన మొక్కలు నాటాలని పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో పనులు 100 శాతం పూర్తి చేసి ఆగస్టులో అందుబాటులోకి తీసుకు వస్తామని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీ సీజీఎం, అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. నగరంలో రోజూ ఉత్పత్తయేయ్యే మురుగు నీటిని వంద శాతం శుద్ధి చేసేందుకు జలమండలి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం మూడు ప్యాకేజీల కింద రూ.3,866.41 కోట్ల వ్యయంతో కొత్తగా 31 మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ) నిర్మిస్తోంది. వీటిని మొత్తం 5 సర్కిళ్లలో నిర్మిస్తుండగా నిత్యం 1257.50 ఎమ్మెల్డీల (మిలియన్ లీటర్ పర్ డే) మురుగు నీరు శుద్ధి చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News