Thursday, January 23, 2025

ఎండి శైలజా కిరణ్ విచారణకు సహకరించడంలేదు: ఎపి సిఐడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులో ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదని ఎపి సిఐడి అడిషనల్ ఎస్‌పి రవి కుమార్ తెలిపారు. విచారణకు వెళ్లినప్పుడు తమని మార్గదర్శి నిర్వహకులు, సిబ్బంది అడ్డుకున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి కేసులో చట్టానికి లోబడే దర్యాప్తు చేస్తున్నామన్నారు. సిఐడి విచారణపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. నిబంధనల ప్రకారమే మార్గదర్శి కేసులో విచారణ జరుగుతోందని, విచారణకు మార్గదర్శి యాజమాన్యం సరిగా స్పందించడంలేదన్నారు. విచారణలో సమయంలో మార్గదర్శి యాజమాన్యం ఆటంకాలు సృష్టించారన్నారు. ఎండి శైలజా కిరణ్ విచారణకు సహకరించడంలేదన్నారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారన్నారు.

Also Read: ప్రియురాలు కోసం రైల్వే సిగ్నల్‌పై దాడి…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News