Monday, January 20, 2025

ఇండియాకు బంగ్లాదేశ్ అల్టిమేటం!

- Advertisement -
- Advertisement -

ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అసలు అప్పగించే ఉద్దేశం ఉందా, లేదా? అని బంగ్లాదేశ్, భారత్ కు అల్టిమేటం ఇచ్చింది. మీడియా వర్గాల ప్రకారం బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు ఎండీ తౌహీద్ హుసైన్ మీడియాతో మాట్లాడుతూ హసీనాను బంగ్లాదేశ్ కు రప్పించేందుకు యూనస్ ప్రభుత్వం ఏమైనా చేస్తుందని భరోసా ఇచ్చారు. భారత్ కు ఎన్నిసార్లు చెప్పినా అప్పగించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తలచుకుంటే ఎలాగైనా హసీనాను తీసుకురాగలదన్నారు.

అసలు హసీనా భారత్ లో ఎక్కడుండో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి తెలుసా? అని మీడియా ప్రశ్నించినప్పుడు ‘‘ఆ విషయం భారత్ నే అడగండి’’ అంటూ తౌహీద్ హుసైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ లో చెలరేగిన విద్యార్థుల నిరసన హద్దులు మీరడంతో హసీనా ప్రాణ భయంతో ఇండియాలో ఆశ్రయం పొందింది. బంగ్లాదేశ్ హసీనా, ఆమె బంధువుల దౌత్య పాస్ పోర్ట్ లను రద్దు చేసింది.

హసీనాకు భారత్ ఆశ్రయం కొనసాగిస్తే రెండు దేశాల మధ్య భవిష్యత్ సంబంధాలు దెబ్బతింటాయని కూడా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఫఖ్రూల్ ఇస్లాం ఆలంగీర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News