Sunday, November 17, 2024

టికెట్ రాలేదని పురుగుల మందు తాగిన ఎంపి

- Advertisement -
- Advertisement -

చెన్నై: సాధారణంగా ఓ పార్టీ ఒకరికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించిందంటే ఆ అభ్యర్థి పార్టీ ఫిరాయించడం లేదా స్వతంత్రంగా పోటీకి దిగడం జరుగుతుంది. కానీ పార్టీ మళ్లీ టికెట్ ఇవ్వలేదని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఎంపి సంఘటన దేశంలోనే తొలిసారి. తమిళనాడుకు రాష్ట్రం ఈరోడ్ నియోజకవర్గానికి గణేశ మూర్తి (74) ఎండిఎంకే పార్టీ నుంచి ఎంపిగా ఉన్నా రు. ఆయనకు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించింది. ఎండిఎంకే ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకేతో పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా కొన్ని సీట్లకు అ ధికార పార్టీకి త్యాగం చేశారు.

ఇందులో ఈరోడ్‌కి డీఎంకే నుంచి ప్రకాశ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కి సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న ఈయనకే ఈరోడ్ టికెట్ నిర్ధారించడంతో ఆ నియోజకవర్గ టికెట్ ఆశించిన గణేశ్ మూర్తికి ఆశాభంగం తప్పలేదు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక, బయటకి చెప్పుకోలేక గణేశ లోలోపలే కుంగిపోయారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఆ యన పురుగుల మందు తాగాడని కుటుంబ స భ్యులు చెప్పారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News