- Advertisement -
కేంద్ర ప్రభుత్వం సూచన
న్యూఢిల్లీ: ఆ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల దృష్టా తదుపరి ఉత్తర్వుల వరకు ఇరాన్ లేదా ఇజ్రాయెల్‌కు ప్రయాణించవద్దని భారతీయులకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ శుక్రవారం సూచించింది. ఇరాన్ లేదా ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయులందరూ తమ దేశాలలోని భారతీయ ఎంబసీలను సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కేంద్రం ఒక ప్రకటనలో కోరింది.
ఆ రెండు దేశాలలో నివసిస్తున్న ప్రజలందరూ తమ భద్రత పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని, సాధ్యమైనంత వరకు బయట తిరగకుండా ఉండాలని ఆ ప్రకటనలో కేంద్రం సూచించింది. ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.
- Advertisement -