కోల్‌కతా: రోమ్‌లోని వాటికన్ నగరంలో అక్టోబర్‌లో జరుగనున్న ప్రపంచ శాంతి సమావేశానికి హాజరు కావాల్సిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అనుమతి నిరాకరించింది. కాగా సెప్టెంబర్ 30న భవానీపూర్ అసెంబ్లీకి జరుతున్న ఉపఎన్నిక ప్రచారంలో ఆమె మాట్లాడుతూ “నన్ను ఎన్ని ప్రదేశాలకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటుంది(కేంద్రం)?” అని నిలదీశారు.
“ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే స్థాయికి ఆ ఈవెంట్ సరిపోదు” అంటూ ఆమెకు అనుమతిని నిరాకరించింది విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ.
ప్రపంచ శాంతి సమావేశం ఇటలీ రాజధాని రోమ్‌లో రెండు రోజులపాటు జరుగనుంది. అది అక్టోబర్ 6,7 తేదీల్లో. ఆ సమావేశానికి ఇటలీ ప్రధాని మారియో డ్రాగితో పాటు పోప్ ఫ్రాన్సిస్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కూడా హాజరుకానున్నారు. భారత దేశం నుంచి ఈ సమావేశానికి ఆహ్వానాన్ని అందుకున్న ఒకే ఒక వ్యక్తి మమతా బెనర్జీ. అది కూడా సమాజానికి ఆమె చేసిన మానవతా సేవలకు గుర్తింపుగా ఈ ఆహ్వానం అందింది. ఆ సమావేశంలో మమతా బెనర్జీ ప్రసంగించే అవకాశం కూడా ఉండింది.
“సాధారణంగా ఇలాంటి ఆహ్వానాలకు చాలా మంది ముఖ్యమంత్రులు అనుమతి తీసుకోరు. కానీ నేను దేశ విదేశాంగ విధానాలను గౌరవిస్తూ అనుమతిని కోరాను. కానీ నిరాకరించబడింది. ఆ ఈవెంట్‌కు ఆహ్వానం అందుకున్న ఒకే ఒక భారతీయురాలిని తాను” అని మమతా బెనర్జీ తెలిపారు. వారు తనను ఆపాలనుకున్నారనిఅన్నారు. “ఇతర ప్రదేశాలకు మీరు ఎల్ల కాలం నన్ను ఆపలేరు” అంటూ ఆమె ఆక్రోశాన్ని వెల్లిబుచ్చారు.
మమతా బెనర్జీకీ రోమ్ వెళ్ళేందుకు అనుమతి నిరాకరణ
- Advertisement -
- Advertisement -
- Advertisement -